Friday, March 13, 2015

తల్లా పెళ్ళామా - తెలుగు జాతి మనది నిండుగ వెలుగుజాతి మనది - ఘంటసాల, ఎన్.టి. రామారావు బృందం

తల్లా పెళ్ళామా - తెలుగు జాతి మనది నిండుగ వెలుగుజాతి మనది - ఘంటసాల, ఎన్.టి. రామారావు బృందం

పల్లవి :
తెలుగుజాతి మనది నిండుగ వెలుగు జాతిమనది - Hero
తెలుగుజాతి మనది నిండుగ వెలుగు జాతిమనది - All
తెలంగాణ నాది - Other
రాయలసీమ నాది - Other
సర్కారు నాది - Other
నెల్లూరు నాది -  - Other
అన్నీ కలసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా... - Hero
తెలుగుజాతి మనది నిండుగ వెలుగు జాతిమనది - All

చరణం : 1
ప్రాంతాలు వేరైనా  - Hero
మన అంతరంగమొకటేనన్నా - Hero
యాసలు వేరుగ ఉన్నా  - Hero
మన బాస తెలుగు బాసన్నా - Hero
వచ్చిండన్నా వచ్చాడన్నా... - Hero
వచ్చిండన్నా వచ్చాడన్నా  - Hero
వరాల తెలుగు ఒకటేనన్నా - Hero
తెలుగుజాతి మనది నిండుగ వెలుగు జాతిమనది - All

చరణం : 2
మహాభారతం పుట్టింది  - Hero
రాణ్మహేంద్ర వరంలో - Hero
భాగవతం వెలసింది ఏకశిలానగరంలో - Hero
ఈ రెంటిలోన ఏదికాదన్నా... - Hero
ఈ రెంటిలోన ఏదికాదన్నా  - Hero
ఇన్నాళ్ల సంస్కృతి నిండుసున్న - Hero
తెలుగుజాతి మనది నిండుగ వెలుగు జాతిమనది - All

చరణం : 3
పోచంపాడు ఎవరిది? నాగార్జునసాగరమెవరిది? - Hero
పోచంపాడు ఎవరిది? నాగార్జునసాగరమెవరిది? - All
మూడు కొండ్రలూ కలిపి దున్నిన ముక్కారు పంటలు బండ్లకెత్తిన - Hero
అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలౌ ఐదుకోట్ల తెలుగువారిది - Hero
తెలుగుజాతి మనది నిండుగ వెలుగు జాతిమనది - All

చరణం : 4
సిపాయికలహం విజృంభించ నరసింహాలై గర్జించాము - Hero
స్వతంత్ర భారత్‌కీ జై... - All
గాంధీ నెహ్రూల పిలుపులందుకొని సత్యాగ్రహాలు చేశాము - Hero
వందేమాతరం... వందేమాతరం... - All
స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము - Hero
జై విశాలాంధ్ర... - All
దేశభక్తిలో తెలుగువారికి దీటే లేదనిపించాము - Hero
తెలుగుజాతి మనది నిండుగ వెలుగు జాతిమనది - All

చరణం : 5
ఇంటిలోన అరమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా - Hero
కంటిలో నలక తీయాలంటే కనుగ్రుడ్డు పెరికివేయాలా - Hero
పాలుపొంగు మన తెలుగు గడ్డను పగలగొట్టవద్దు - Hero
పాలుపొంగు మన తెలుగు గడ్డను పగలగొట్టవద్దు - All
నలుగురిలో మనజాతి పేరును నవ్వులపాలు చెయ్యొద్దు - Hero
తెలుగుజాతి మనది నిండుగ వెలుగు జాతిమనది - All
తెలంగాణ మనది, రాయలసీమ మనది, సర్కారు మనది, నెల్లూరు మనది - All
అన్ని కలిసిన తెలుగునాడు మనదే మనదే  మనదే రా - All

తెలుగుజాతి మనది నిండుగ వెలుగుజాతి మనది - All

No comments:

Post a Comment